News January 6, 2025
ASF: ఎమ్మెల్సీ కవిత పర్యటన జయప్రదానికి పిలుపు
బీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్, కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో కవిత పర్యటిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Similar News
News January 16, 2025
ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP
భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News January 16, 2025
సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి: ADB కలెక్టర్
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్ హాల్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పీవో ఖుష్బూ గుప్తా హాజరయ్యారు.
News January 15, 2025
క్రీడలతో శారీరక ఆరోగ్యం: బోథ్ MLA
నేరడిగొండ మండలంలోని బొందిడిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం యువకులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు.