News April 4, 2024
ASF: ఏనుగు దాడిలో మరో రైతు మృతి

జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News October 23, 2025
ఆదిలాబాద్: ’26లోపు కొటేషన్లు సమర్పించాలి’

ADB జిల్లాలోని15 ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఫర్నీచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ మెటీరియల్ పెయింటింగ్ పని, కొనుగోలు నిమిత్తం స్థానిక ఫర్ముల నుంచి సీల్ చేసిన కోటేషన్లకు ఆహ్వానిస్తున్నట్లు DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆసక్తి గల స్థానిక ఫర్ములు లేదా సరఫరాదారులు, సంబంధిత వివరాల అవసరాల జాబితా కోసం డీఈఓ క్వాలిటీ కోఆర్డినేటర్ ను సంప్రదించాలన్నారు. కోటేషన్లు ఈనెల 26లోపు సమర్పించాలన్నారు
News October 23, 2025
ఉట్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఎదురెదురుగా బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన అంకన్నతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 23, 2025
ఆదిలాబాద్: కరాటే మాస్టర్లు…ఇది మీకోసమే

విద్యార్థులకు కరాటే శిక్షణ నేర్పడానికి కరాటే మాస్టర్లు ఈనెల 23 నుంచి 30 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో పాఠశాల వారీగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్థానికత, బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్, పూర్వపు అనుభవం వారి ప్రతిభ ఆధారంగా కరాటే మాస్టర్లను ఎంపిక చేస్తామన్నారు. మహిళా కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.