News April 4, 2024

ASF: ఏనుగు దాడిలో మరో రైతు మృతి

image

జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News April 24, 2025

జిల్లా వ్యాప్తంగా 31 కేసులు

image

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలోని 31 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు

News April 24, 2025

పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి: SP

image

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందుతున్న కానిస్టేబుల్‌లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్‌లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. మొత్తం 28 మందికి పదోన్నతి రాగ అందులో ఆదిలాబాద్ జిల్లా వారు పదిమంది ఉండటం సంతోషకరమని ఎస్పీ అన్నారు.

News April 24, 2025

అదిలాబాద్ నుంచి సికింద్రాబాద్‌‌కు గంజాయి రవాణా

image

నిర్మల్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాలిలా.. మలావత్‌ రాజేందర్, ఇండాల్‌ రాథోడ్‌ ఆదిలాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. బుధవారం వారిద్దరు కారులో గంజాయి ప్యాకెట్లు తీసుకుని నగరానికి వస్తుండగా బోయిన్‌పల్లి వద్ద ఎక్సైజ్‌ SI శివకృష్ణ వీరిని అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!