News April 3, 2024

ASF: ఏనుగు దాడిలో రైతు మృతి

image

ఏనుగు దాడిలో రైతు మృతిచెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగింది. అతడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన గురై పరుగులు తీశారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

image

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.