News March 20, 2025

ASF: గంజాయి పట్టివేత.. నిందితుడిపై కేసు

image

తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామానికి చెందిన మెంద్రపు చిన్నయ్య ఇంట్లో 875 గ్రాముల గంజాయిని బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు చిన్నయ్య ఇంట్లో తనిఖీ చేశామన్నారు. సుమారు రూ.21 వేల విలువైన గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. గంజాయిని సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 2, 2026

ఖమ్మం: అవసరమే ఆసరా.. అడ్డగోలు వసూళ్లు.!

image

ఖమ్మం జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు చక్రవడ్డీలు, వడ్డీలతో సామాన్యుల రక్తాన్ని పీలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరాలను ఆసరాగా చేసుకుని, రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా, ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు అక్రమ వడ్డీ మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటున్నారు.

News January 2, 2026

ఉదయగిరి: మళ్లీ పులి వచ్చింది..!

image

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.

News January 2, 2026

215 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ITI) 215 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్లండి.