News March 31, 2025

ASF: గురుకులాల దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణ జ్యోతిబా ఫులే బీసీ గురుకులాలకు (6,7,8,9) తరగతుల బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తు గడువు మార్చి 31తో ముగిసింది. కాగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పొడిగించినట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త శ్వేత వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News October 29, 2025

PDPL: భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సమీక్షలో భూ భారతి, సాధా బైనామా, మీ సేవా దరఖాస్తులపై వేగవంతమైన పరిష్కారం కోరారు. ప్రభుత్వ భూముల జాబితా సిద్ధం చేయాలని, ఎస్‌ఐఆర్ పనులు శనివారానికి పూర్తిచేయాలని సూచించారు. బైపాస్ రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ పనులు త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.

News October 29, 2025

నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండేలా చర్యలు: మంత్రి అనగాని

image

AP: గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజనలోని లోపాలను సవరించడంపై క్యాబినెట్ సబ్‌ కమిటీ ఇవాళ చర్చించింది. CM ఆదేశాలు, మంత్రులు ఇచ్చిన సూచనలను పరిశీలించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండల, పంచాయతీలను విభజించకుండా నియోజకవర్గమంతటినీ ఒకే డివిజన్‌లో ఉంచాలని నిర్ణయించామన్నారు. కాగా కేంద్రం చేపట్టే జనగణనకు ముందే విభజనపై నివేదికను అందిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు.

News October 29, 2025

తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి: కలెక్టర్

image

వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, డీఆర్డిఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. తుఫాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు.