News April 16, 2025
ASF: గ్రేట్.. 40 నిమిషాల్లోనే దొంగను పట్టుకున్నారు

ఆసిఫాబాద్‌కు చెందిన మీర్అలీ తన స్కూటీలో పెట్టిన రూ.36 వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లడంతో ASF పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ASF CI రవీందర్ పోలీస్ సిబ్బందితో కలసి చాకచక్యంగా వ్యవహరించి 40 నిమిషాల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు. అరెస్టు చేసి అతడి నుంచి రూ.36 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Similar News
News September 13, 2025
జగిత్యాల: శాంతి భద్రతలకు విఘాతం.. పీడీ యాక్ట్ నమోదు

శాంతి భద్రతలకు భంగం కలిగించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన బండి తరాల శ్రీకాంత్‌పై పలుమార్లు కేసులు నమోదైనా, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, అతనిపై పిడి యాక్ట్ నమోదు చేసి కరీంనగర్ జైలులో ఉంచి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎస్పీ చెప్పారు.
News September 13, 2025
షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్లైన్లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
News September 13, 2025
విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.