News April 16, 2025

ASF: గ్రేట్.. 40 నిమిషాల్లోనే దొంగను పట్టుకున్నారు

image

ఆసిఫాబాద్‌కు చెందిన మీర్అలీ స్కూటీలో పెట్టిన రూ.36 వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లడంతో ASF పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ASF CI రవీందర్ పోలీస్ సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి 40 నిమిషాల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు. అరెస్టు చేసి అతడి నుంచి రూ.36 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Similar News

News November 6, 2025

కళాశాలలను తనిఖీ చేసిన డీఐఈఓ శ్రీధర్ సుమన్

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు, రికార్డుల నిర్వహణలో ఇంటర్ బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని DIEO శ్రీధర్ సుమన్ సూచించారు. ఖానాపూర్ మోడల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ కళాశాలలను DIEO తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ అభ్యసన తరగతులు నిర్వహించాలన్నారు.

News November 6, 2025

మెట్‌పల్లి: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: అదనపు కలెక్టర్

image

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ లత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వాతావరణ మార్పు దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ అన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఎమ్మార్వో, ఏపీఎం, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

News November 6, 2025

ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

image

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <>https://sbi.bank.in/<<>>లో అందుబాటులో ఉంచారు. వీరికి త్వరలో సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు ఆగస్టు 2, 4,5 తేదీల్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ 13న మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయిన విషయం తెలిసిందే.