News February 27, 2026
ASF: చనిపోయి.. నలుగురిని కాపాడింది

ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఈస్త సృజన(34) అవయవాలను దానం చేసి నలుగురికి జీవితం ప్రసాదించారు. ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సృజన ICUలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. భర్త నాగరాజు అంగీకరించడంతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అమర్చారు. సృజన మృతితో గ్రామం కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబాన్ని అభినందించింది.
Similar News
News April 15, 2026
KMR: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. బీబీపేట, భిక్కనూరు, ఎల్పుగొండ 42.8°C, పిట్లం 42.7, మాచాపూర్, సోమూర్, గాంధారి, మేనూరు 42.6, నస్రుల్లాబాద్, ఇసాయిపేట 42.5, సర్వాపూర్, బొమ్మన్ దేవిపల్లి 42.4, సదాశివనగర్ 42.2, కొల్లూరు, జుక్కల్ 42.1, IDOC(కామారెడ్డి), దోమకొండ 41.9, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి 41.8, పాత రాజంపేట 41.7°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 15, 2026
WGL: విద్యార్థులకు బడిలో టిఫిన్.. మెనూ ఇదే!

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 3,251 పాఠశాలలు, 50 కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇందుకు ఏటా రూ. 720 కోట్లు వెచ్చించనున్నారు. విద్యార్థులకు రుచికరమైన దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ లాంటి మెనూ ఖరారు చేశారు.
News April 15, 2026
WGL: ఆర్డీవోలకే పూర్తి అధికారం.. ఇక ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారం..!

ఉమ్మడి WGLలో ఐదున్నర ఏళ్లుగా 1,89,739 సాదాబైనామా దరఖాస్తులు మోక్షం కోసం ఆఫీసర్ల టేబుళ్లపై ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఆర్డీవోలకే పూర్తి అధికారం ఇవ్వడంతో ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారమవుతాయని, అఫిడవిట్ నిబంధన తీసేయడంతో కొర్రీలన్నీ పోయినట్టేనని అంతా భావిస్తున్నారు. కాగా కోర్టుల్లో పిల్ వేసి 2016లో GO 153, 2020లో GO 112 అమలు కాకుండా చేశారు. ప్రస్తుతం భూ భారతిలో మార్పులతో ఈ సమస్య పరిష్కారం కానుంది.


