News April 10, 2025
ASF: జిల్లాకు విజయవాడ నుంచి నకిలీ విత్తనాల సరఫరా

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ హెచ్చరించారు. కాగజ్‌నగర్ నవత ట్రాన్స్‌పోర్ట్‌లో బెజ్జూర్ మండలం కృష్ణపెళ్లికి చెందిన కోకాడి చంద్రశేఖర్ పేరు మీద విజయవాడ నుంచి 45కిలోల నకిలీ పత్తి విత్తనాలను పార్సిల్ వచ్చిందన్నారు. దానిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.1,57,500 ఉంటుందన్నారు.
Similar News
News February 23, 2026
పాలమూరు:రైతు భరోసా.. ఎప్పుడొచ్చేనో?

ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. MBNR-2,44,853, NGKL-3,29,128, GDWL-1,79,052, WNPT-1,87,633, NRPT-1,90,153 మంది రైతులు ఉన్నారు. నవంబర్ లోనే రైతు భరోసా అందవలసి ఉండగా.. భూముల సర్వే (ధరణి) ప్రక్రియ, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
AIADMK హామీలు: మహిళలకు ₹2,000.. పురుషులకూ ఫ్రీ బస్సు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో AIADMK చీఫ్ పళనిస్వామి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ₹2,000 సాయం అందిస్తామన్నారు. మహిళలతో పాటు పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని, పేదలకు ఇళ్లు, ఆటో డ్రైవర్లకు సబ్సిడీలు ఇస్తామని ప్రామిస్ చేశారు. DMK సర్కార్ ఒక ‘ఫెయిల్యూర్ మోడల్’ అంటూ విమర్శలు గుప్పించారు.
News February 23, 2026
బాఫ్టాలో భారతీయ సినిమా ‘బూంగ్’ చరిత్ర.. బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా అవార్డు!

BAFTA-2026 అవార్డుల్లో మణిపురీ చిత్రం ‘Boong’ సత్తా చాటింది. ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం’ కేటగిరీలో అవార్డు గెలుచుకొంది. ఈ విభాగంలో బాఫ్టా అవార్డు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘జూటోపియా 2’ వంటి సినిమాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు.


