News February 12, 2025
ASF జిల్లాలో పత్తి రైతుల పడిగాపులు

ఆసిఫాబాద్ జిల్లాలోని CCI సర్వర్ డౌన్ కారణంగా జిల్లాలో రెండు రోజులుగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియక రెండు రోజులుగా కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ మిల్లులవద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. రైతులపై వెయిటింగ్ చార్జీల భారం పడుతుందని అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Similar News
News September 18, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.
News September 18, 2025
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.
News September 18, 2025
భద్రాచలం: డ్రిల్ బిట్‌ను మింగిన బాలుడు

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఎటపాక మండలం చోడవరానికి చెందిన గౌతమ్(8) ఆడుకుంటూ డ్రిల్ బిట్‌ను మింగాడు. అది పేగులో ఇరుక్కోవడంతో బాలుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి డ్రిల్ బిట్‌ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.