News January 26, 2025

 ASF జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామ్‌కుమార్

image

లింగాపూర్ మండలం అలీగూడ ప్రాథమిక పాఠశాల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ అడే రామ్ కుమార్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థులు, బంధువులు, కంచన్‌పల్లి కాంప్లెక్స్ HM ఆత్రం శంకర్ రావు రామ్‌కుమార్‌ను అభినందిస్తున్నారు. ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

నో మేకప్.. మేకప్ లుక్ కావాలా?

image

ప్రస్తుతకాలంలో ‘నో మేకప్- మేకప్ లుక్‌’ ట్రెండ్ అవుతోంది. దీనికోసం తేలిగ్గా ఉండే మాయిశ్చరైజర్, రేడియన్స్ ప్రైమర్, ల్యుమినైజింగ్ ఫౌండేషన్ వాడాలి. డార్క్ సర్కిల్స్ కనిపించకుండా లైట్‌గా కన్సీలర్ రాయాలి. ఐ ల్యాష్ కర్లర్, మస్కారా, ఐ లైనర్ అప్లై చెయ్యాలి. చీక్ బోన్స్‌పై బ్రాంజర్, బ్లషర్ రాయాలి. మ్యూటెడ్ లిప్ కలర్, టింటెడ్ లిప్ బామ్ పెదవులకు అద్దాలి. అంతే మీ నో మేకప్ లుక్ రెడీ.

News September 16, 2025

HYD: అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్!

image

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని HYD లక్డీకపూల్‌లోని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారని సమాచారం. OCT 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ఈ సంఘం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నట్లు తెలిసింది. కొంతకలంగా వారు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

News September 16, 2025

HYD: నిందితులు ముగ్గురు చిన్ననాటి ఫ్రెండ్స్

image

కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాంచీకి చెందిన ప్రధాన నిందితులు హర్ష్ కుమార్, రోషన్ సింగ్ వారికి సహకరించిన రాజువర్మను కంది జైలుకు తరలించారు. ఈ ముగ్గురూ చిన్ననాటి నుంచి స్నేహితులని పోలీసులు తెలిపారు.