News March 13, 2025
ASF: జిల్లా ప్రజలు హోలీని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లా ప్రజలు హోలీని ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాస్ రావు కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 14న జరుపుకునే హోలీని ఉ.6 నుంచి మ.12 వరకు జరుపుకోవాలన్నారు. సురక్షితమైన రంగులను ఉపయోగించాలని.. ఇష్టంలేని వారిపై రంగులు వేయడం నిషిద్ధం అన్నారు. ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే ఏ చర్యనైనా సహించేది లేదన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదన్నారు.
Similar News
News September 18, 2025
SRD: భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
News September 18, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.