News March 12, 2025
ASF: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్

జిల్లావ్యాప్తంగా SFI ఆధ్వర్యంలో నిర్వహించిన SSC టాలెంట్ టెస్ట్ పరీక్ష ఫలితాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే విడుదల చేసినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయికుమార్, సాయికృష్ణ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3000 మంది విద్యార్థులు పరీక్షను రాసినట్లు చెప్పారు. విద్యార్థులు తమ హెడ్మాస్టర్ల వద్ద ఫలితాలు చూసుకోవచ్చన్నారు.
Similar News
News March 17, 2025
బీబీనగర్: అర్ధరాత్రి చోరీ.. బైక్‌పై దొంగలు!

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారంలో ఆదివారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండగా సీసీ కెమెరాలలో రికార్డైంది. బీబీనగర్ పెట్రోలింగ్ పోలీసులు దొంగలు చొరబడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
News March 17, 2025
ఏలూరు : బాలికపై అత్యాచారం .. కేసు

ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన పౌలు (20) అనే ఆటో డ్రైవర్‌పై రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 15 ఏళ్ల బాలికకు ప్రేమించానని మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.