News February 16, 2025
ASF: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

ADB, KNR, NZB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News March 12, 2025
జగిత్యాల: రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలి: అదనపు కలెక్టర్

రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ (DCC) త్రైమాసిక సమీక్షా సమావేశoలో ఆమె మాట్లాడారు. జిల్లా బ్యాంకింగ్ రంగ ప్రగతిని సమీక్షించడంతోపాటు ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందుబాటు, వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ కుమార్ తదితర అధికారులున్నారు.
News March 12, 2025
ఎల్లుండి మద్యం షాపులు బంద్

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 12, 2025
పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.