News April 4, 2025

ASF: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 27, 2025

నిబంధనల మేరకే వైన్ షాప్ నిర్వహించాలి: MHBD కలెక్టర్

image

MHBD జిల్లాలో నిర్వహించిన 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించిన వైన్ షాపులను నిబంధనల మేరకే నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని 61 వైన్ షాపుల లక్కీ డ్రా నిర్వహణ కార్యక్రమం సందర్భంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని ఆదేశించారు.

News October 27, 2025

MHBDలో లిక్కర్ షాపులకు లక్కీ పర్సన్స్ వీరే..!

image

MHBD జిల్లా కేంద్రంలో 14 లిక్కర్ షాపులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం లక్కీ డ్రా తిశారు. గౌడ క్యాటగిరిలో వెంకన్న(నెల్లికుదురు), రాంబాబు, వెంనూర్, శ్రీచందన(హసన్పర్తి), వెంకటేష్(ఖమ్మం), సుభద్ర దేవి(HNK), ఓపెన్లో రజీత(నర్సంపేట్), వెంకటేశ్వర్లు(mhbd), సారయ్య(కొత్తగూడ), వేణు(కేసముద్రం), లక్ష్మీనారాయణ(మరిపెడ), రాకేష్ యాదవ్, ఎన్ రజీత(MHBD), SCలో జంపన్న(తొర్రూర్) దక్కించుకున్నారు.

News October 27, 2025

గుంటూరు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

image

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీస్ (24×7) కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
@జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0863-2230100
@ఈస్ట్ సబ్‌డివిజన్–0863-2223353
@వెస్ట్ సబ్‌డివిజన్– 0863-2241152 / 0863-2259301
@నార్త్ సబ్‌డివిజన్–08645-237099
@సౌత్ సబ్‌డివిజన్–0863-2320136
@తెనాలి సబ్‌డివిజన్–08644-225829
@తుళ్లూరు సబ్‌డివిజన్–08645-243265