News April 21, 2025

ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

image

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 21, 2025

భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను మరచిపోం: పీఎం మోదీ

image

పోప్ ఫ్రాన్సిస్ మృ‌తి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోమని అన్నారు. ‘పోప్ ఫ్రాన్సిస్ మృతి చాలా బాధను కలిగించింది. ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం. జాలి, దయ, వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాదిమంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని పేర్కొన్నారు.

News April 21, 2025

వాట్సప్ సేవలను ఉపయోగించుకోవాలి: కర్నూల్ కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూల్ కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు” పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, డిఆర్ఓ వెంకట్ నారాయణమ్మతో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తుందన్నారు.

News April 21, 2025

ఇండియాలో 83% పన్నీర్ కల్తీనే.. ఇలా చెక్ చేయండి!

image

శాకాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘పన్నీర్’ ఇప్పుడు భారతదేశంలో అత్యంత కల్తీ ఆహార ఉత్పత్తిగా మారింది. ప్రస్తుతం 83% పన్నీర్ కల్తీ అని, అందులో 40శాతం వాటిని ఏ జంతువు తినకూడదని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో కల్తీ పన్నీర్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఉడకబెట్టిన పన్నీర్‌పై రెండు చుక్కల అయోడిన్ డ్రాప్స్ వేయాలి. నీలి రంగులోకి మారితే అది ఫేక్. ఒరిజినల్‌ది తెలుపు లేదా లైట్ ఆరెంజ్‌లోకి మారుతుంది.

error: Content is protected !!