News April 13, 2025

ASF: తాటి ముంజలకు భలే గిరాకీ

image

ఎండాకాలం వచ్చిందంటే వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే తాటి ముంజలు జిల్లాలో అందుబాటులో లభిస్తాయని ప్రజలు అంటున్నారు. శనివారం వాంకిడి మండలకేంద్రంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలు ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యలు సూచించడంతో కొనడానికి మక్కువ చూపుతున్నారు.

Similar News

News April 19, 2025

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

image

ఛానల్ అప్డేట్స్, మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగే ఫీచర్‌‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. హిందీ సహా స్పానిష్, రష్యన్, అరబిక్ తదితర విదేశీ భాషలు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో రోల్ ఔట్ కానుంది.

News April 19, 2025

శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

‘జాట్‌’లో ఆ సీన్ తొలగింపు

image

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

error: Content is protected !!