News April 15, 2025
ASF: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్ కుమార్

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా వాంకిడి మండలానికి చెందిన కోట్నక విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర మహాసభల సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
తక్కువ పంట కాలం.. బీర సాగుతో మంచి ఆదాయం

సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. బీరకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. బీర పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీరను క్షార, ఆమ్ల లక్షణాలు ఉన్న నేలల్లో తప్ప మిగిలిన అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
News January 9, 2026
కామారెడ్డిలో దొంగల బీభత్సం

కామారెడ్డిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి ఐదు దుకాణాల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News January 9, 2026
‘రథసప్తమి’కి అంకురార్పణ

సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఉదయం అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. జనవరి 19 నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.


