News March 13, 2025

ASF: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్‌లో అందిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో ధరణిలో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్‌లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసి పరిష్కరించాలాన్నారు.

Similar News

News October 21, 2025

ADB: నేటికీ చెదరని జ్ఞాపకాలు!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1983 నుంచి నక్సలైట్ల అలజడిలో ఖానాపూర్ సర్కిల్ పరిధిలో 19 మంది పోలీసులు అమరులయ్యారు. తుపాకీ మోత చప్పుళ్లతో అల్లకల్లోలమైన అప్పటి పరిస్థితులు నేటికీ ఒళ్లు జలదరింపజేస్తున్నాయి. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అమరవీరుల కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

News October 21, 2025

HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

image

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్‌లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్‌లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.

News October 21, 2025

పార్వతీపురం మన్యం: మీ సేవలు మరువం..!

image

రేయింబవళ్లు కష్టపడి శాంతిభద్రతలను కాపాడే రక్షభటులకే కొన్ని సందర్భాల్లో రక్షణ కరువవుతోంది. పార్వతీపురం జిల్లాలో సీఐ ముద్దాడ గాంధీ, ఏ.ఆర్ కానిస్టేబుల్ షేక్ ఇస్మాయిల్, సివిల్ కానిస్టేబుల్లు బి.శ్రీరాములు, సీహెచ్.చిరంజీవిరావు, ఎస్.సూర్యనారాయణ విధుల్లో ఉండగా ప్రాణాలు విడిచారు. నేడు ‘పోలీసు అమరవీరుల సమస్మరణ దినోత్సవం’ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ పార్వతీపురంలో స్మృతి పరేడ్ నిర్వహించనున్నారు.