News March 20, 2025
ASF: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే JOB MELA

నిరుద్యోగులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం పట్టణంలోని రోజ్ గార్డెన్లో 1000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆమె బుధవారం తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలైన(SSKD, ఫాక్స్కాన్, యాపిల్ సంస్థ)లో అర్హత కలిగి ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు. నిరుద్యోగ యువతులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 7, 2025
భీమవరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్

భీమవరం ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.2 కోట్ల CSR నిధులతో నిర్మించే డయాలసిస్ సెంటర్కు ఆదివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి భూమిపూజ చేశారు. 8 యంత్రాలు, 10 బెడ్లతో ఈ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు లభించి, దూర ప్రాంతాలకు వెళ్లే కష్టం తప్పుతుందని వారు పేర్కొన్నారు.
News December 7, 2025
ఆదిలాబాద్: పార్టీ రెబల్స్తో ‘పంచాయితీ’

పంచాయతీ ఎన్నికల వేళ సొంత పార్టీలోని రెబెల్స్తో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ పెద్దలు హెచ్చరించినా.. ఇంకేదైనా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన పలువురు రెబెల్స్ వెనక్కి తగ్గకుండా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. చిన్న పల్లెల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరూ, మేజర్ పంచాయతీల్లో నలుగురు బరిలో నిలిచారు. దీంతో ఓట్లు చెయ్యి పార్టీ అభ్యర్థులు గెలవరేమోనని నాయకుల్లో ఆందోళన నెలకొంది.
News December 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 89 సమాధానం

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్రంలో పాల్గొన్న వృద్ధరాజు. భీష్ముడికి తండ్రి వరుస అవుతాడు. ధర్మం వైపు మొగ్గు ఉన్నా, రాజధర్మం కారణంగా కౌరవులకు మద్దతు ఇచ్చాడు. చివరికి భీముడి చేత మరణం పొందాడు. ఎవరతను?
సమాధానం: బాహ్లికుడు. ఈయన శంతనుడి సోదరుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


