News April 15, 2025

ASF: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 599 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.

Similar News

News October 31, 2025

వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

image

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

News October 31, 2025

FLASH.. FLASH.. హనుమకొండ: పెళ్లి వాహనానికి యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

image

హనుమకొండ(D)భీమదేవరపల్లి(M) ముల్కనూర్ PS పరిధి గోపాలపురం దగ్గర ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్(D) కురవి(M) సైదాపురం గ్రామానికి చెందిన 21మంది నల్లపూసల తంతు ముగించుకుని పెళ్లి వాహనం (బొలేరో)లో సిద్దిపేట నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో గోపాలపురం దగ్గర వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వారిని వరంగల్ MGMకు అంబులెన్స్‌లో తరలించారు.

News October 31, 2025

IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

image

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్‌కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్‌గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌‌గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్‌లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679