News February 23, 2025

ASF: నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

image

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Similar News

News December 5, 2025

ఇండిగో.. ఒక్కరోజే 550 విమానాల రద్దు

image

నిన్న 550 విమానాలను రద్దు చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో DGCAకు నివేదిక ఇచ్చింది. ఫేజ్-2 ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(FDTL) ప్రకారం సిబ్బంది లేక సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పింది. నిబంధనల అమలులో పొరపాట్లు, ప్లానింగ్‌ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఇండిగో రోజుకు దాదాపు 2,300 ఫ్లైట్లను నడుపుతోంది.

News December 5, 2025

CEOలనూ AI వదలదు: రచయిత స్టువర్ట్

image

ఫ్యూచర్‌లో CEO ఉద్యోగాలనూ AI లాగేసుకునే ఛాన్స్ ఉందని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ మోడ్రన్ అప్రోచ్’ పుస్తక సహ రచయిత స్టువర్ట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు. AIకి నిర్ణయాధికారం ఇవ్వాలని లేదంటే తప్పుకోవాలని బోర్డు సభ్యులు CEOను డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. పని అనుకునే ప్రతి దాన్నీ AI చేసేస్తోందన్నారు. ఇప్పటికే కార్మికులు, డ్రైవర్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు నష్టపోతున్నామనే చర్చ జరుగుతోంది.

News December 5, 2025

ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.