News January 25, 2025
ASF: పండగకెళ్లిన పిల్లలను బడికి పట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

లింగాపూర్ మండలం కంచన్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లి పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. చిన్నదాంపూర్ గ్రామానికి వెళ్లి 10 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు జగదీశ్వర్, టాటుషావ్, కోట్నాక్ సాయికుమార్ పట్టుకొస్తున్నారు. విద్యార్థులను అలానే వదిలేయకుండా చదువుల బాట పట్టించాలని వినూత్న కార్యక్రమానికి తలపెట్టిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.
Similar News
News November 9, 2025
మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
కమనీయంగా వేములవాడ రాజన్న కళ్యాణం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం జరిపించారు.
News November 9, 2025
HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్రావునగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.


