News January 25, 2025
ASF: పండగకెళ్లిన పిల్లలను బడికి పట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

లింగాపూర్ మండలం కంచన్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లి పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. చిన్నదాంపూర్ గ్రామానికి వెళ్లి 10 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు జగదీశ్వర్, టాటుషావ్, కోట్నాక్ సాయికుమార్ పట్టుకొస్తున్నారు. విద్యార్థులను అలానే వదిలేయకుండా చదువుల బాట పట్టించాలని వినూత్న కార్యక్రమానికి తలపెట్టిన ఉపాధ్యాయులను పలువరు అభినందించారు.
Similar News
News February 15, 2025
మీర్పేట్: అధ్యక్షురాలికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ జాగృతి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మిర్యాల పావనిని ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
News February 15, 2025
చికెన్‌లో ఈ భాగాలు తింటున్నారా?

కోడిలో దాదాపు అన్ని భాగాలనూ మనం తింటాం. కానీ దాని మెడ, తోక, ఊపిరితిత్తుల్ని తినకుండా ఉండటమే శ్రేయస్కరమంటున్నారు ఆహార నిపుణులు. ఆ భాగాల్లో ఉండే హానికరమైన క్రిములు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా చర్మంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ ఉంటాయని, స్కిన్ లెస్ తినడమే బెటర్ అని సూచిస్తున్నారు.
News February 15, 2025
దుగ్గొండి: ‘ఈజీఎస్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’

జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో కౌసల్యాదేవి తెలిపారు. దుగ్గొండిలో ఉపాధి హామీ 2023-24 వార్షిక సంవత్సరంలో చేపట్టిన పనులపై మండల స్థాయి సామాజిక ప్రజా వేదికను శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై ఈజీఎస్, పంచాయతీ అధికారులు సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో అరుంధతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.