News March 21, 2025

ASF: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. శుక్రవారం జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆసిఫాబాద్ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి తనిఖీ చేశారు. కాగా జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 3, 2025

ఈ విషయం మీకు తెలుసా?

image

చెప్పులు, బూట్లు కొనేటప్పుడు చాలా మంది పొడవు నంబర్‌ను మాత్రమే చూస్తారు. అయితే షూలకు పొడవుతో పాటు వెడల్పును సూచించే ప్రత్యేక నంబర్లు (ఉదాహరణకు, B,AA, EE) కూడా ఉంటాయి. ఇది తెలియక కొందరు కొత్తవి ఇరుకుగానే ఉంటాయని భావించి మౌనంగా నొప్పిని భరిస్తుంటారు. దీనివల్ల పాదాలు, అరికాళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి షూ కొనే సమయంలో Width, Length చూడాలంటున్నారు. దీనికోసం పైనున్న ఫొటో చూడండి.

News December 3, 2025

మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

image

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.

News December 3, 2025

సంగారెడ్డి: 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

image

పంచాయతీ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకాని 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. డిసెంబర్ 5న నిర్వహించే డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఆమె సూచించారు. లేకుంటే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.