News March 21, 2025

ASF: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. శుక్రవారం జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆసిఫాబాద్ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి తనిఖీ చేశారు. కాగా జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 20, 2025

తాడిపత్రి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఉద్యోగం రాలేదని యువకుడు నరసింహ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తాడిపత్రిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నరసింహ ఇంజినీరింగ్ చదివాడు. ఉద్యోగం కోసం పలు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 20, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 20, 2025

ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

image

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.

error: Content is protected !!