News August 17, 2024
ASF: పిడుగుపాటుకు ఇద్దరు మృతి

పిడుగుపాటుకు కొమురం భీం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కెరమెరి మండలానికి చెందిన చౌదరి రమేశ్ (30) చింతకర్ర వెళ్లే మార్గంలో పత్తి పంటకు యూరియ వేస్తుండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలం చోర్ పల్లి పంచాయతీ పరిధి నందూపకు అంజన్న (20) సంకెపల్లి శివారులోని తన పొలం నుంచి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Similar News
News November 30, 2025
సిరికొండ: నలుగురు మహిళా సర్పంచ్‌లు ఏకగ్రీవం

సిరికొండ మండలంలో 7గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. నేరడిగొండ (జి) క్లస్టర్‌లోని 4గ్రామపంచాయతీలకు నామినేషన్ నిర్వహించగా కుంటగూడ, జెండగూడ, నారాయణపూర్, నేరడిగోండ (జి)లో నలుగురు మహిళలను సర్పంచ్‌లుగా ఏకగ్రీవం చేశారు.

News November 29, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణిని తిరిగి యథావిధిగా ఉంటుందన్నారు.