News April 15, 2025

ASF: పెళ్లికెళ్లొస్తుండగా యాక్సిడెంట్..ముగ్గురికి గాయాలు

image

వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంబారా శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వాంకిడి ASI పోశెట్టి కథనం ప్రకారం.. వాంకిడి మండలం ఖేడేగాంకి చెందిన ఆత్రం సోనేరావు, మరో ద్విచక్రవాహనంపై మడావి దౌలత్ గణేష్ పూర్ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బంబార గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 26, 2026

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

News February 26, 2026

నిర్మల్: పుష్కరాలకు కావల్సిన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి, గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

News February 26, 2026

రష్మిక-విజయ్ పెళ్లి ఫొటోలు

image

విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ఉదయం గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫొటోలను రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ సైతం పెళ్లి ఫొటోలను SMలో షేర్ చేశారు. దీంతో అభిమానులు విరోష్ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.