News February 27, 2025

ASF: పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNS యాక్ట్: SP

image

కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా పట్టభద్రుడు ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రాల వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుమిగూడా వద్దని, పార్టీ జెండాలు గుర్తులు ఉంచరాదన్నారు.

Similar News

News November 21, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.

News November 21, 2025

యాదాద్రికి కార్తీక మాసంలో ₹17.62 కోట్ల ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈసారి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నెల రోజులలో ఆలయానికి ₹17,62,33,331 చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు అధికంగా లభించాయి. ఈ మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News November 21, 2025

కుసుమ ప్రతిభకు ఎమ్మెల్యే శ్రావణి సత్కారం

image

దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి, దేశ కీర్తిని చాటిన నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమను ఎమ్మెల్యే బండారు శ్రావణి అభినందించారు. కుసుమను, ఆమె కుటుంబ సభ్యులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆర్థిక సాయం అందించారు. ఎవ‌రెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమ‌ని కుసుమ తెలపగా, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.