News August 2, 2024
ASF: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం పోస్టర్‌ను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా శిశు వైద్యశాఖ అధికారులతో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
Similar News
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్‌ను పలువురు అభినందించారు.
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.


