News March 27, 2025
ASF: ‘ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య’

పాస్టర్ ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య అని ఆసిఫాబాద్ పాస్టర్ల సంఘం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం సంఘ కర్తలు, పాస్టర్లు రాజమండ్రి పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ కాదు హత్య చేశారని ఆరోపించారు. ఆయన్ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
Similar News
News October 18, 2025
5 జిల్లాల్లో ₹7910 కోట్లతో చురుగ్గా జలజీవన్ పనులు

AP: 5 జిల్లాల్లో ₹7910 కోట్లతో జలజీవన్ పథకం పనుల్ని ప్రభుత్వం చురుగ్గా సాగిస్తోంది. ఈ పథకం నిధులు మురిగిపోయే పరిస్థితి రాగా మరో 4 ఏళ్లు పొడిగించేలా కూటమి సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మళ్లీ పనులకు శ్రీకారం చుట్టించింది. ఇవి పూర్తయితే 1.22 కోట్ల మందికి రక్షిత నీరందుతుంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న పశ్చిమ ప్రకాశంలో ₹1290కోట్లతో పనులు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కొన్ని పూర్తయ్యాయి.
News October 18, 2025
న్యాయవ్యవస్థలు దిగొస్తాయని నమ్ముతున్నాం: ఆర్.కృష్ణయ్య

TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమని భావించి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయవ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. బీసీ కులాల గౌరవం, పేదరిక నిర్మూలన కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.
News October 18, 2025
బీచ్లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్ విమర్శించారు. బీచ్లో హైమాస్ట్ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్ అందాన్ని కాపాడాలని సూచించారు.