News March 16, 2025

ASF: బాధ్యతలు స్వీకరించిన ధోని శ్రీశైలం

image

ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా అధ్యక్షుడిగా ధోని శ్రీశైలం రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని ఉన్నత స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్యామ్ సుందర్, శ్రీనివాస్, రఘునాథ్, తదితరులున్నారు.

Similar News

News December 2, 2025

ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

image

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.

News December 2, 2025

HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

image

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్‌ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.

News December 2, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.