News February 21, 2025
ASF: బాలికపై వేధింపులు.. ఒకరికి 19ఏళ్ల జైలు

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ బాలిక సిర్పూర్(టి)లోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని తల్లిదండ్రులు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు సిర్పూర్(T) ఠాణాకు రిఫర్ చేయగా.. SIకమలాకర్ విచారణ చేపట్టారు. శ్రీరాంపూర్‌కు చెందిన కనకం సత్యనారాయణ బాలికను అపహరించి వేధింపులకు పాల్పడ్డాడు. అతడిని పట్టుకొని కోర్టులో హాజరుపర్చగా జిల్లా జడ్జి MVరమణ 19ఏళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానావిధించారు.
Similar News
News March 26, 2025
ఈనెల 28న ఏలూరు కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు

ఏలూరు కలెక్టరేట్ గిరిజన భవన్‌లో ఈనెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా.. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఆమె పేర్కొన్నారు. కనుక ఏలూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు, ఇఫ్తార్ విందుకు రావాలని కలెక్టర్ కోరారు.
News March 26, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం బుధవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు పూజలు హారతి ఇచ్చి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.
News March 26, 2025
బాపట్ల: పిల్లలకు ఒంటిపూట బడులు.. తల్లిదండ్రులు జాగ్రత్త

బాపట్ల గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా. కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలని అధికారులు కోరుతున్నారు.