News April 6, 2025
ASF: బాల రాముడు సూపర్

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఓ చిన్నారి శ్రీరాముని వేషాధారణలో పలువురిని ఆకట్టుకుంది. మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రీకాంత్-రమాదేవి దంపతుల కుమార్తె జెట్టి గనిష్క రాముడి వేషధారణలో అందరిని అలరించింది. చిన్ననాటి నుంచి దేవుడి వేషాధరణలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం శుభప్రదమని పలువురు అభిప్రాయపడ్డారు.
Similar News
News April 20, 2025
Google: భారీగా భారత ఉద్యోగుల తొలగింపు!

గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయిస్‌కు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవ్వొచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
News April 20, 2025
కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.