News January 6, 2025
ASF: భరోసా కేంద్రం సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ భరోసా సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ గురించి, సెంటర్‌లో పనిచేసే ఉద్యోగుల విధులు తెలుసుకున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. సిబ్బందికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి భాస్కర్, భరోసా ఉమెన్ ఎస్సై తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ తదితరులు ఉన్నారు.
Similar News
News January 26, 2025
ADB: బ్యాంకు లాకర్‌లో బంగారం ఆభరణాలు మాయం
ఆదిలాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో నుంచి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులు సాధారణ తనిఖీలు చేపట్టగా, బ్యాంకు లాకర్‌లో నుంచి 507.4 గ్రాముల బంగారు ఆభరణాలు మిస్సైనట్లు తనిఖీల్లో తేలింది. వీటి విలువ రూ. 29 లక్షల 20 వేలు ఉంటుంది. బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 26, 2025
ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి
పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News January 26, 2025
ఆదిలాబాద్‌లో వివాహిత అదృశ్యం
ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్ నగర్‌కు చెందిన వివాహిత అదృశ్యమైనట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. 32 ఏళ్ల కవిత భర్త చంద్రకాంత్‌కు మధ్య గొడవలు జరిగాయి. దీంతో శనివారం కవిత ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో టూ టౌన్‌లో ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ విష్ణు ప్రకాశ్ మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.