News March 19, 2025
ASF: భారమంతా.. బడ్జెట్‌పైనే..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ASFజిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో కొమురంభీమ్, జగన్నాథ్‌పూర్, వట్టివాగు ప్రాజెక్టులు, గుండి వాగు, వార్ధా నదిపై వంతెనల నిర్మాణాలకు నిధులిస్తే అవస్థలు తొలగుతాయని భావిస్తున్నారు. 1000ఏళ్ల చరిత్ర ఉన్న రంగనాయకస్వామి ఆలయం, సిద్ధేశ్వర గుట్టలు, పాలరాపుల గుట్ట, జోడేఘాట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
Similar News
News November 17, 2025
బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్లు

AP: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడలోని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. APNCET-2025లో 20 పర్సంటైల్ కంటే ఎక్కువ, 85-17 కటాఫ్ స్కోర్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. చివరి తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు <
News November 17, 2025
నల్గొండ జిల్లా ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్ బుక్.. తస్మాత్ జాగ్రత్త

‘Sharath Chandra Pawar IPS’ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించారు. దాని నుంచి పంపించే మెసేజ్‌లు, ఫ్రెండ్ రిక్వెస్టులకు ఎవరూ స్పందించవద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి డబ్బులు అడిగినా, ఇతర మెస్సేజ్‌లు ఏవి పెట్టినా ఎవ్వరూ స్పందించవద్దని ఆయన పేర్కొన్నారు.
News November 17, 2025
నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.


