News February 2, 2025

ASF: భారీగా కలప స్వాధీనం.. ఐదుగురి రిమాండ్

image

మండలంలోని ఆడా గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు అనుమానాస్పదంగా వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రూ.18 వేల విలువగల 4 టేకు దుంగలను జప్తుచేసినట్లు ఆసిఫాబాద్ FRO గోవింద్ సింగ్ సర్దార్, జోడేఘాట్ FRO జ్ఞానేశ్వర్ తెలిపారు. ఐదుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Similar News

News February 10, 2025

పెళ్లి చేసుకున్న నటి

image

మలయాళీ నటి పార్వతి నాయర్ పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఆమె వివాహమాడారు. ఈ క్రమంలో ఆ జంటకు విషెస్ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాపిన్స్, నిమిరిందు నిల్, ఎన్నై అరిందుల్(ఎంతవాడు గానీ), ఉత్తమ విలన్, ఓవర్ టేక్ వంటి సినిమాల్లో ఆమె నటించారు.

News February 10, 2025

జగిత్యాల: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 20 ZPTCలు, 216 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

News February 10, 2025

స్కిల్ వర్సిటీకి నిధులివ్వలేం: కేంద్రం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం షాక్ ఇచ్చింది. దానికి నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా INC MP చామల కిరణ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి నిధులిచ్చే పథకమేమీ కేంద్రం వద్ద లేదని మంత్రి జయంత్ చౌదరి తేల్చి చెప్పారు.

error: Content is protected !!