News March 7, 2025
ASF: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఆసిఫాబాద్లో గాలినాణ్యత విలువ 80గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News December 3, 2025
పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.
News December 3, 2025
తిరుమల: డిసెంబర్ 5న డయల్ యువర్ ఈవో

డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
News December 3, 2025
1,232 విమానాలు రద్దు: DGCA

IndiGo ఇటీవల 1,232 విమానాలను రద్దు చేసిందని DGCA ప్రకటించింది. ఇందులో సిబ్బంది, FDTL పరిమితుల వల్లే 755 ఫ్లైట్స్ రద్దయినట్లు పేర్కొంది. ATC సమస్యలతో 16% ఫ్లైట్స్, క్రూ రిలేటెడ్ డిలేస్తో 6%, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లిమిటేషన్స్ వల్ల 3% సర్వీసులు క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. OCTలో 84.1%గా ఉన్న IndiGo ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ NOVలో 67.7%కి డ్రాప్ అయిందని వివరించింది. HYDలోనూ పలు విమానాలు రద్దయ్యాయి.


