News January 24, 2025

ASF: మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

image

స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌లో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.25.04 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును గురువారం ఆయన అందించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ టీజీబీ మేనేజర్లు మురళీ మనోహర్‌రావు, ప్రభుదాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర: అంబటి

image

మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు. మిర్చి యార్డులో మాట్లాడటానికి మా అధినేత కనీసం మైక్ కూడా వాడరు. జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఎన్నికల కోడ్ పేరుతో భద్రత కల్పించకుండా ఉంటే పోలీసులే ఇబ్బంది పడతారు’ అని అంబటి హితవు పలికారు.

News February 19, 2025

గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం

image

HYD గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!