News February 20, 2025
ASF: మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్

ఆర్టీసీ బస్సు మహిళ కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. బుధవారం ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ప్రయానించిన తిర్యాణికి చెందిన దేవిదాస్ తన భార్యకు చెందిన సర్టిఫికెట్స్ బస్సులో మర్చిపోయాడు. గమనించిన కండక్టర్ మునెమ్మ వాటిని డీఎం విశ్వనాథ్కు అప్పగించింది. దీంతో ఆయన సంబంధిత వ్యక్తికి సమాచారం అందించి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కండక్టర్ను అభినందించారు.
Similar News
News December 19, 2025
UIIC 153 పోస్టులకు నోటిఫికేషన్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (<
News December 19, 2025
వాజేడు: నాలుగు కాళ్ల కోడి పిల్ల

వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో నాలుగు కాళ్లతో ఉన్న కోడి పిల్ల బయటకు వచ్చింది. అదే కోడి గుడ్ల నుంచి పుట్టిన మిగతా కోడి పిల్లలు సాధారణంగానే ఉండగా, ఒక్క పిల్ల మాత్రం 4 కాళ్లతో కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. పలువురు తమ ఫోన్లలో దృశ్యాన్ని బంధించారు.
News December 19, 2025
అనకాపల్లి: 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక

అనకాపల్లి జిల్లాలో 2025-26 రబీ సీజన్లో 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి శుక్రవారం తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 8,824 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7,898 టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరులోగా మరో 926 టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు చెప్పారు. నానో ఎరువులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.


