News February 20, 2025

ASF: మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్

image

ఆర్టీసీ బస్సు మహిళ కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. బుధవారం ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ప్రయానించిన తిర్యాణికి చెందిన దేవిదాస్ తన భార్యకు చెందిన సర్టిఫికెట్స్ బస్సులో మర్చిపోయాడు. గమనించిన కండక్టర్ మునెమ్మ వాటిని డీఎం విశ్వనాథ్‌కు అప్పగించింది. దీంతో ఆయన సంబంధిత వ్యక్తికి సమాచారం అందించి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కండక్టర్‌ను అభినందించారు.

Similar News

News March 17, 2025

మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

image

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.

News March 17, 2025

SRPT: మొట్టమొదటి MBBS డాక్టర్‌ రామకృష్ణారెడ్డి మృతి

image

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ బీ.రామకృష్ణారెడ్డి ఆదివారం కోదాడలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతిచెందారు. కాగా, కోడాడకు మొట్టమొదటి MBBS డాక్టర్‌ ఈయనే. రామకృష్ణారెడ్డికి కోదాడ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో ఎండీ కోర్స్ పూర్తి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

News March 17, 2025

నేడు అసెంబ్లీలోకి చరిత్రాత్మక బిల్లులు

image

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. SCవర్గీకరణకు చట్టబద్ధతతో పాటు BCలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ముందుకు రానుంది. వీటిపై సభలో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రస్తుతం BCలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

error: Content is protected !!