News February 18, 2025

ASF: ‘మిమ్మల్ని వేధిస్తున్నారా.. కాల్ చేయండి’

image

ఆసిఫాబాద్ జిల్లాలో భరోసా సెంటర్‌లు ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయిందని డీఎస్పీ కరుణాకర్ తెలిపారు. లైంగిక దాడికి గురైన మహిళలకు, బాలికలకు అండగా భరోసా సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే 8712670561 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ బుద్ధ రవీందర్, భరోసా సిబ్బంది ఎస్ఐ తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ, ఏఎన్ఎం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 8, 2025

VJA: భవానీ దీక్షల విరమణపై సీపీ సమీక్ష

image

భవాని దీక్షల విరమణ బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు దేవస్థాన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు యాప్ ఆధునీకరణపై చర్చించారు. దర్శన సమయాలు, పార్కింగ్, సేవల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

News November 8, 2025

శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించింది ఎర్ర చందనం: DCM పవన్

image

ఎర్ర చందనం చాలా అపురమమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గాయం తగిలి, గాయం వల్ల చిందిన రక్తంతో ఎర్రచందనం పుట్టినట్లు శాస్త్రం చెబుతోందన్నారు. ఏపీలోని స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిలిపివేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 8, 2025

కీరాతో ఎన్నో లాభాలు

image

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.