News February 18, 2025
ASF: ‘మిమ్మల్ని వేధిస్తున్నారా.. కాల్ చేయండి’

ఆసిఫాబాద్ జిల్లాలో భరోసా సెంటర్‌లు ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయిందని డీఎస్పీ కరుణాకర్ తెలిపారు. లైంగిక దాడికి గురైన మహిళలకు, బాలికలకు అండగా భరోసా సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే 8712670561 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ బుద్ధ రవీందర్, భరోసా సిబ్బంది ఎస్ఐ తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ, ఏఎన్ఎం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 28, 2025
ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు

260వ ర్యాంకు- దివి మురళి.. దివీస్ ($ 10B)
600- P పిచ్చిరెడ్డి.. MEIL ($5.8B)
625- PV కృష్ణారెడ్డి.. MEIL ($5.6B)
1122- ప్రతాప్ సి.రెడ్డి.. అపోలో హస్పిటల్స్ ($3.3B)
1122- PV రాంప్రసాదరెడ్డి.. అరబిందో ఫార్మా ($3.3B)
1198- B పార్థసారథిరెడ్డి.. హెటిరో ల్యాబ్స్ ($3.1B)
1624- K సతీశ్ రెడ్డి.. డాక్టర్ రెడ్డీస్ ($2.3B)
1796- M సత్యనారాయణరెడ్డి.. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ($2.1B)
News March 28, 2025
VJA: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.