News January 23, 2025
ASF: రూ.74 లక్షల విలువైన గంజాయి కాల్చేశారు

ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా నమోదైన 53 కేసుల్లో నిందితుల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయిని సీజ్ చేశామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 117 కిలోల గంజాయిని NPDS చట్ట ప్రకారం జిల్లా ట్రక్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని మానకొండూరులో ఇన్సినిరేషన్ సెంటర్ వద్ద దహనం చేశారు. దాని విలువ సుమారు రూ.74 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2025
BJP విజయానికి అసదుద్దీన్, MIM హెల్ప్!

BJP విజయంలో MIM పరోక్షపాత్రపై చర్చ జరుగుతోంది. ఆమ్‌ఆద్మీని మట్టికరిపించడంలో అసదుద్దీన్ ప్రభావం తోడైందంటున్నారు. ఢిల్లీలో ముస్లిములు గణనీయంగా ఉంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వీరు పదేళ్లుగా AAPకు ఓటేస్తున్నారు. ఈసారి పార్టీలన్నీ పొత్తుల్లేకుండా బరిలోకి బలమైన అభ్యర్థులనే దించడంతో ముస్లిముల ఓట్లు చీలాయి. MIMకు మొత్తం 80వేల ఓట్లు రావడం స్వల్ప మార్జిన్లతో చాలాచోట్ల BJPని గెలిపించింది.
News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News February 8, 2025
కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్

BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.