News September 29, 2024
ASF: రేపు జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్‌లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్‌ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: ఆదిలాబాద్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీల కమిషనర్‌తో ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
News December 30, 2025
ఆదిలాబాద్: చైనా మంజా.. 5 కేసులు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో చైనా మంజాపై పూర్తిగా నిషేధం విధించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా, దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు వన్ టౌన్లో 5 కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా చైనా మంజా విక్రయిస్తే సమాచారం అందించాలని కోరారు.
News December 30, 2025
ఆదిలాబాద్: 2025లో పోలీసుల అద్భుత ఫలితాలు

2025లో పోలీసులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది 20గా ఉన్న నేరస్తుల శిక్షల సంఖ్య ఈసారి 51కి పెరిగింది. CEIR ద్వారా 718 ఫోన్లను రికవరీ చేశారు. షీ టీమ్స్, పోలీస్ అక్క కార్యక్రమాలతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడమని ఎస్పీ వెల్లడించారు.


