News February 23, 2025

ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

image

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఒక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.

Similar News

News November 8, 2025

ఎంత కాలం రెంట్‌కి ఉన్నా ఓనర్లు కాలేరు: సుప్రీం

image

‘ది లిమిటేషన్ యాక్ట్-1963’ ప్రకారం 12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకే కొందరు తమ టెనంట్లను ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఈక్రమంలో యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అద్దెకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పొందలేరని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టు తొలుత టెనంట్ పక్షాన నిలువగా.. సుప్రీం ఈ గందరగోళానికి ముగింపు పలికింది.

News November 8, 2025

మేడారం మహా జాతర పనులపై సందిగ్ధం..!

image

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సమీపిస్తోంది. జాతరకు మరో 81 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభివృద్ధి పనులపై సందిగ్ధం నెలకొంది. గ్రామంలో రోడ్డు వెడల్పు పనుల్లో స్థానికుల ద్వారా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య పెరుగుతోంది.

News November 8, 2025

వరంగల్: 24 అంతస్తులకు 24 ఏళ్లు కావాలా..?

image

WGLలో రూ.1200 కోట్లతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం 2021లో శంకుస్థాపన చేసింది. 2 ఏళ్లలో పూర్తిచేసి 12అంతస్తుల్లో 35వైద్య విభాగాల్లో OP, IP సేవల కోసం 2208 పడకలను, 500 మంది వైద్యులు, 1000 మంది స్టాఫ్ నర్సులు, మరో 1000 మంది పారా మెడికల్ వైద్య సిబ్బంది సేవలు అందించేలా నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్లో పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పట్లో పనులు పూర్తయ్యేలా లేవు.