News February 4, 2025
ASF: వన్యప్రాణులను వేటాడే మఠాను పట్టుకున్న ఆర్పీఎఫ్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో పలువురు అనుమానితులను రైల్వే పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ట్రైన్లో అనుమానాస్పదంగా కనబడ్డ వీరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వన్యప్రాణుల వేటకు వాడే ఆయుధాలు లభ్యమైనట్లు తెలిపారు. వీరితో పట్టణ పోలీసులు అటవీశాఖ అధికారులు ఉన్నారు.
Similar News
News November 17, 2025
శుభ సమయం (17-11-2025) సోమవారం

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31
News November 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 17, 2025
పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.


