News February 4, 2025

ASF: వన్యప్రాణులను వేటాడే మఠాను పట్టుకున్న ఆర్పీఎఫ్

image

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో పలువురు అనుమానితులను రైల్వే పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ట్రైన్లో అనుమానాస్పదంగా కనబడ్డ వీరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వన్యప్రాణుల వేటకు వాడే ఆయుధాలు లభ్యమైనట్లు తెలిపారు. వీరితో పట్టణ పోలీసులు అటవీశాఖ అధికారులు ఉన్నారు.

Similar News

News February 16, 2025

మళ్లీ వస్తున్నాం: తెలుగులో Delhi Capitals ట్వీట్

image

IPL-2025లో Delhi Capitals 2 మ్యాచ్‌లు విశాఖపట్నంలో ఆడనుంది. ఈ నేపథ్యంలో ‘మళ్లీ వస్తున్నాం. వైజాగ్‌కు మాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని తెలుగులో ట్వీట్ చేసింది. APలోని రాజాంకు చెందిన GMR గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు కుమారుడే ఢిల్లీ జట్టు కోఓనర్ కిరణ్ కుమార్. ఆయన ప్రస్తుతం GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. సొంత రాష్ట్రంపై అభిమానంతో 2వ హోం వెన్యూగా వైజాగ్‌ను ఎంచుకున్నారు.

News February 16, 2025

MDCL: ఇంటర్ విద్యార్థుల్లో ఒత్తిడి, నిద్రలేమి

image

ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కారానికి టెలీ మానస్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలో డిసెంబర్, జనవరి నెలల్లో జిల్లాల వారీగా టెలీ మానస్ కేంద్రానికి వచ్చిన సమస్యలపై 14 మంది ఒత్తిడికి గురవుతున్నామని, ఇద్దరు సరిగ్గా నిద్ర పట్టడం లేదని, ఇతర సమస్యలతో 13 మంది టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News February 16, 2025

రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు

image

AP: తిరుపతిలో రేపు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.

error: Content is protected !!