News February 23, 2025
ASF: విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్ దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28 చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.
Similar News
News November 27, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం తుఫాన్గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది.
News November 27, 2025
వేములవాడ ఆలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో కేవలం శానిటేషన్ విభాగం సిబ్బందికి మాత్రమే ఈ విధానం అమలులో ఉండగా, కొత్తగా ఆలయ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు వేసుకునే పద్ధతిని ప్రారంభించారు. కాగా, ఆలయ ఈవో రమాదేవి బయోమెట్రిక్ హాజరు పనిచేస్తున్న తీరును గురువారం పరిశీలించారు.
News November 27, 2025
సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.


